ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NRPT: జనరల్ పీఎంశ్రీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం TGRJC CET-2026కు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సౌమ్య తెలిపారు. నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.