జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి
VKB: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, ప్రజలను గజగజ వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. గత పది రోజులుగా పల్లెల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.