'దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలి'
ప్రకాశం: దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని మార్కాపురానికి చెందిన బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డా. ఏలూరి రామచంద్ర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని, ఈ నిర్ణయం ప్రాంతీయ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కురిచేడు, దొనకొండ మండలాలు మార్కాపురానికి కేవలం 30km మాత్రమే అన్నారు.