ప్రశాంతంగా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక
NRPT: మక్తల్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన కో ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ ఎంపిక పత్రాలు అందజేశారు. మక్తల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయగా చైర్మన్ మానస అధ్యక్షతన ఈ సమావేశాన్ని కొనసాగించారు.