వజ్రాల వేట కొనసాగేది ఈ చెరువులోనే..!
NTR: కంచికచర్ల మండలం పరిటాల శివారులోని చెరువు వజ్రాల వేటకు ప్రసిద్ధి చెందింది. వర్షాలు కురిసిన ప్రతిసారి ఆశావాహులు ఇక్కడికి చేరుకుని వేట కొనసాగించడం సర్వ సాధారణమైనదని స్థానికులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరగడంతో అరుదుగా మాత్రమే వజ్రాల వేట సాగుతుందని వాపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతూనే ఉందని చెప్పారు.