VIDEO: మోతేకు SRSP జలాలు.. అన్నదాతల హర్షం
SRPT: ఎట్టకేలకు SRSP జలాలు మోతే మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ పరిసర పొలాలకు చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ నీటి రాక ప్రాణం పోసింది. ఆదివారం రాఘవాపురం వద్ద కాల్వల ద్వారా పొలాల్లోకి చేరుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి అన్నదాతలు మురిసిపోయారు.