21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
విశాఖ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా నిర్వహించనున్నారు.