నేడు కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం
మార్కాపురం జిల్లా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఇవాళ జనని ఛారిటబుల్ ట్రస్ట్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, గుంటూరు శంకర్ నేత్రాలయ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.