రేపు కాకినాడలో జాబ్ మేళా
KKD: జిల్లాలో అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా ఉద్యోగ మేళా జరుగనుంది. బీపీవో, ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, విస్ట్రాన్, టీవీఎస్ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో నిరుద్యోగ యువతీయువకులు హాజరు కావాలని ప్రిన్సిపల్ అనంతలక్ష్మి కోరారు.