నేడు పాలమూరులో ఉగాది కవి సమ్మేళనం

నేడు పాలమూరులో ఉగాది కవి సమ్మేళనం

MBNR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నేడు ఉగాది కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఉగాది గొప్పతనాన్ని చాటుతూ కవులు పాల్గొని కవితా గానం చేస్తారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ జి. మమత పాల్గొంటారని పేర్కొన్నారు.