అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం
NTR: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం అంగన్వాడి కేంద్రం 68వ సెంటర్‌లో పోషణ పక్వాడ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్త పద్మ గర్భిణీ స్త్రీలు, 0-6 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకు మార్కెట్‌లో లభించే జెంక్ ఫుడ్ తినడం మంచిది కాదని, అంగన్వాడిలో అందించే ఆహారంలో మంచి పోషకాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.