ఎమ్మెల్యేను కలిసిన అధ్యాపకుల బృందం

ఎమ్మెల్యేను కలిసిన అధ్యాపకుల బృందం

NRML: భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం గురువారం ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో భేటీ అయ్యారు. పీఎం ఉషా పథకం కింద కళాశాలకు రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. కళాశాల సౌకర్యాలు, విద్యార్థుల చదువుల అంశంపై ఎమ్మెల్యే ఆరా తీశారు. పనులు ప్రారంభించేలా అధికారులకు సూచనలు ఇస్తానని ఆయన అన్నారు.