రాజాంలో పింఛన్‌ల పంపిణీ

రాజాంలో పింఛన్‌ల పంపిణీ

VZM: రాజాం నియోజకవర్గంలోని సురవరం, మండవకురిటి గ్రామాల్లో ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా అత్యధిక పింఛన్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని కొనియాడారు. లబ్ధిదారులకు అండగా ఉంటామని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.