బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చీకురుమిల్లి

అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామానికి చెందిన చీకురుమిల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. శుక్రవారం విడుదల చేసిన లిస్టులో తన పేరు ఉందని ఆయన తెలిపారు. ఆయన గతంలో బెల్లంపూడి పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. దీంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.