విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలి: కమిషనర్

VKB: గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం అందించాలని సూచించారు. వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.