అప్పన్న సన్నిధిలో కలెక్టర్ హరీంద్ర

VSP: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ డా. హరీంద్ర ప్రసాద్ గురువారం సందర్శించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆలయంలోని మంచినీటి వసతులు, అన్నప్రసాదం నాణ్యత వంటి అంశాలపై దేవస్థానం అధికారులతో చర్చించారు.