ట్రాఫిక్ సేఫ్టీపై వాహనదారులకు అవగాహన..!
KDP: ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని CK దిన్నె సీఐ బాల మద్దిలేటి పేర్కొన్నారు. సోమవారం CI, ఎస్సై శ్రీనివాసుల రెడ్డి ఆర్టీవో ఆఫీస్ ఎదుట వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు.