'వాస్తవాలను విచారించి చర్యలు చేపడతాం'
RR: షాద్ నగర్‌లో గురుకుల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ జోనల్ ఛైర్మన్ నిర్మల, ఏసీపీ లక్ష్మీనారాయణ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై విచారణ కమిటీ వేసి వాస్తవాలను విచారించి చర్యలను చేపడతామని అధికారులు తెలిపారు.