VIDEO: అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
MLG: జిల్లా మల్లంపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ దివాకర్ టిఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారం సక్రమంగా, నాణ్యతతో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు.