వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
SKLM: ఎచ్చెర్ల మండలం ఓ గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యంపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన మహిళకు ఎచ్చెర్ల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ నెల 17న రాత్రి నుంచి కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి.లక్ష్మణరావు కేసు నమోదు చేశారు.