RTC డ్రైవర్ చనిపోలేదు: మంత్రి పొన్నం
TG: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయాడని వస్తున్న వార్తలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. అవన్నీ అవాస్తవమేనని, శంకర్ ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించానని, RTC కార్మికులు ఆందోళన చెందేలా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.