చేబ్రోలులో వైభవంగా వినాయక నిమజ్జనం
GNTR: చేబ్రోలులో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. నాలుగు రోజులుగా భక్తుల పూజలు అందుకున్న గణేశుని విగ్రహాలను శనివారం నిమజ్జనం చేశారు. డీజే పాటలు, డ్యాన్సులతో ఊరేగింపుగా వెళ్లిన భక్తులు నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వేడుకలను విజయవంతం చేశారు.