తిరుపతిలో రాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
TPT: తిరుపతిలో రాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తనతో కలకలం రేపాడు. బ్యూటీ పార్లర్‌లో పనులు ముగించుకుని అర్ధరాత్రి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసిన మహిళను, ప్రయాణం మధ్యలో డ్రైవర్ అసభ్యంగా తాకి ముద్దు పెట్టాడు. దీంతో ఇంటికి చేరుకున్న ఆమె భర్తకు విషయం తెలపగా.. అతను డ్రైవర్‌ను పట్టుకుని పెట్రోలింగ్ పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.