వందేమాతరం ఒక సంకల్పం: ప్రధాని మోదీ
PM మోదీ వందేమాతరం 150వ స్మారకోత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వందేమాతరం ఒక స్వప్నం, సంకల్పం, మంత్రం, దేశమాత ఆరాధన, సాధన. ఈ శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుంది, భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఈ స్మారకోత్సవాలు దేశవాసులకు ప్రేరణనిస్తాయి. ఈ గేయం మూలభావం భారత్, భారతమాత’ అని తెలిపారు. సామూహిక గీతాలాపనను అద్భుత అనుభవంగా పేర్కొన్నారు.