నేడు మందమర్రిలో పర్యటించనున్న మంత్రి వివేక్

నేడు మందమర్రిలో పర్యటించనున్న మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మందమర్రి మార్కెట్ మజీద్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, అధికారులను కలిసి అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.