సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
KNR: గంగాధర మండల కేంద్రంలోని మధుర నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు, ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు రూ. 23.5 కోట్ల నిధులను మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.