'రాజేష్ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి'
SRPT: కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, సీబీఐ విచారణ జరిపించాలని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో మాట్లాడుతూ.. రాజేష్ మరణానికి నాటి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఎస్పీ నరసింహ నిర్లక్ష్యమే కారణమని, వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చాలని కోరారు.