రామచంద్రారెడ్డి గెలుపు యువతకు స్ఫూర్తి: మాజీ ఎమ్మెల్యే

రామచంద్రారెడ్డి గెలుపు యువతకు స్ఫూర్తి: మాజీ ఎమ్మెల్యే

SRPT: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామంలో 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన గుంటకండ్ల రామచంద్ర రెడ్డి, వార్డు సభ్యులను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ కలిసి అభినందించారు. రికార్డ్ స్థాయి ఈ విజయంతో యువతకు స్ఫూర్తిగా నిలిచారని, గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.