'టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ'

'టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ'

కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఇవాళ టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత అన్న ప్రసాద వితరణ కేంద్రంను ప్రారంభించారు. మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తదితర అధికారులు పాల్గొన్నారు.