కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

MBNR: భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు శేర్పల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.