నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని నిరసన

నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని నిరసన

VSP: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలని శనివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష జరిగింది. రోడ్డును పడ్డ నైట్ ఫుడ్ కోర్ట్ వర్తకులను ఆదుకోవాలని, 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం కచ్చితంగా అమలు చేయాలని వర్తకులు ఆవేదన వెలబుచ్చారు. నైట్ ఫుడ్ కోర్టు స్ట్రీట్ వెండర్కు ఉపాధి కల్పించాలన్నారు.