'ఇచ్చిన హామీని అమలు చేయాలి'

'ఇచ్చిన హామీని అమలు చేయాలి'

AKP: నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన నిర్వాసితుల కుటుంబాల్లో వివాహమైన ఆడపిల్లలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎం రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నక్కపల్లి నిర్వాసితుల కాలనీలో పర్యటించారు. ప్రతి ఒక్క ఆడపిల్లకు 18 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.