BREAKING: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
TG: రాబోయే ఎన్నికల్లో వచ్చేది BRS ప్రభుత్వమే అంటూ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి వెనుకాడకూడదు. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటివరకు ప్రజలు అధైర్య పడకూడదు. కాంగ్రెస్ పాలనలో ఏదో చేస్తారని ప్రజలు ఆగం కావొద్దు' అని KCR కార్యకర్తలకు సూచించారు.