నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం
RR: హయత్‌నగర్ డివిజన్‌లోని ద్వారకామయినగర్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవన నిర్మాణం కోసం కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ విస్తరణ అత్యవసరమని, దీనికి అవసరమైన నిధులు, అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.