టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

గుంటురూ: వినుకొండ పట్టణంలోని 20వ వార్డుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా బొల్లా మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.