VIDEO: BRS నాయకులను తమ గ్రామంలోకి రావొద్దని ఆందోళన
BDK: పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్ నాయకులను తమ గ్రామంలోకి రావొద్దని సోమవారం ఆందోళన చేశారు. పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో సీసీ రోడ్లు, మిషన్ భగీరధ నీళ్లు రావడం లేదు, విద్యుత్ లైన్లు ఇవ్వాలని అడిగితే పట్టించుకోలేదని వారు తెలిపారు.