'సీపీఐ శ్రేణులు పేదలకు అండగా నిలవాలి'
NLG: మునుగోడు మండలం రత్తిపెళ్లి గ్రామానికి చెందిన 22 కుటుంబాలు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సమక్షంలో బుధవారం సీపీఐలో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ గ్రామాల్లోని పేద ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.