వాహనదారులకు BIG ALERT
వాహనదారులకు NHAI కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగత వాహనాల ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంచనుంది. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,075కు చేరనుంది. హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు లోపు రీఛార్జ్ చేసుకునేవారు రూ.3 వేలకే వార్షిక పాస్‌ను పొందే అవకాశం కల్పించారు.