కెనాల్లో కాలు జారి వ్యక్తి గల్లంతు
SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంపల్లి జహంగీర్ (32) బంధువు దినకర్మకు హాజరై, తిరిగి వస్తూ పశువుల మార్కెట్ సమీపంలోని కెనాల్లో స్నానానికి దిగారు. స్నానం ముగించి గట్టుపైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.