చౌటకుంటపల్లిలో రోడ్డు పనుల పరిశీలన
సత్యసాయి: నల్లమాడ మండలం చౌటకుంటపల్లిలో రూ. 60 లక్షలతో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చొరవతో నిర్మాణానికి నోచుకున్న ఈ రోడ్డుకు మోక్షం లభించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డుతో తమ కష్టాలు తీరాయని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.