VIDEO: బిగ్‌బాస్‌లో కొట్టుకున్న కంటెస్టెంట్లు..?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-9 షోలో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు కళ్యాణ్, పవన్, రీతూ చౌదరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీతూ వల్ల పవన్ తన గేమ్‌పై సరిగా ఫోకస్ చేయడం లేదని కళ్యాణ్ ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో డిమాన్ పవన్.. కళ్యాణ్ గొంతునొక్కి వెనక్కి నెట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.