గుర్రంకొండలో పిచ్చికుక్క స్వైర విహారం
అన్నమయ్య: గుర్రంకొండ పట్టణంలోని నబీ కాలనీలో గురువారం రాత్రి పిచ్చికుక్క వీరంగం సృష్టించి ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పట్టణంలో కుక్కలు బెడద అధికంగా ఉందని అధికారుల స్పందించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.