మాజీ సీఎం జగన్‌పై మంత్రి అనగాని విమర్శలు

ప్రకాశం: రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమం చూసి వైసీపీ అధినేత జగన్‌కు కడుపు మండుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయాయని ఆరోపించారు. మహిళను వేధించినా అధికారులను వెనకేసుకొచ్చే ధోరణి జగన్‌ది అని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం శిక్షిస్తుందని అన్నారు.