VIDEO: ఉయ్యూరులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
కృష్ణా: ఉయ్యూరులోని కాపుల రామాలయం సెంటర్‌లో శ్రీరామనవమి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే రాములవారి కళ్యాణం సందడి ప్రారంభమై భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు సమష్టిగా పానకం తయారు చేస్తూ, రాములవారి సేవలో నిమగ్నమయ్యారు. ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొని ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు.