పంటలను పరిశీలించిన బీజేపీ నేతలు

పంటలను పరిశీలించిన బీజేపీ నేతలు

JN: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగాలంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలన్నారు.