మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే
JGL: మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న రెండు మహిళా సంఘాల భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ సత్తిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.