VIDEO: మామిడి తోటలో అగ్నిప్రమాదం.. 20 మామిడి చెట్లు దగ్ధం
MNCL: మందమర్రి మండలం శంకర్ పల్లి గ్రామ శివారులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 20 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫలసాయం చేతికొచ్చే సమయంలో చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో తోట యజమాని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.