నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ

నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ

BDK: నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ మానవత్వాన్ని చాటారు. చలికాలం దృష్ట్యా ఇవాళ పాల్వంచలోని పెద్దమ్మతల్లి గుడి, బస్టాండ్ పరిసరాల్లో ఉన్న నిరాశ్రయులకు రగ్గులు, వాటర్ బాటిల్స్, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.