VIDEO: అడెల్లి పోచమ్మ ఆలయంలో భక్త జనసందోహం
NRML: సారంగాపూర్ మండలంలోని శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవాలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. జిల్లాలోని పలు మండలాల నుంచే కాకుండా, సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించారు. పలువురు భక్తులు బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.