ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న వెంకన్న స్వామి

ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న వెంకన్న స్వామి

కోనసీమ: అమలాపురం పట్టణం లో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఇవాళ భక్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. మార్గశిర మాసం బహుళ నవమి సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు దర్శనానికి బారులు తీరారు. భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్లు చేస్తున్నారు.